
పొలం ఆక్రమణపై కేసు నమోదు
పోరుమామిళ్ల : సిద్దవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. చల్లగిరిగెల గ్రామ రెవెన్యూ పొలంలో నాగిరెడ్డికి చెందిన భూమిని మంగనపల్లెకు చెందిన ఆంజనేయులు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నం చేశాడన్నారు. అలాగే పొలం చుట్టూ నాటిన స్తంభాలను ధ్వంసం చేశాడని, అడ్డం వస్తే చంపుతానని బెదిరించాడని నాగిరెడ్డి ఫిర్యాదు చేశాడన్నారు. గతంలో కూడా ఆంజనేయులు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు
బారికేడ్ల వితరణ
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌కు భారతి సిమెంటు కంపెనీ 10 బారికేడ్లను వితరణగా అందించినట్లు ఎస్‌ఐ తులసీనాగ ప్రసాద్ తెలిపారు. గురువారం భారతి సిమెంటు కంపెనీ మేనేజర్లు ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భారతి సిమెంటు కంపెనీ డీలర్ మల్లికార్జునరెడ్డిలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో 10 నూతన బారికేడ్లను ప్రారంభించి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సామాజిక సేవలో భాగంగా భారతి సిమెంటు కంపెనీ తరపున ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్ రెడ్డి, పోలీసు సిబ్బంది, భారతి సిమెంట్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.