టెంపుల్‌ సిటీ | - | Sakshi
Sakshi News home page

టెంపుల్‌ సిటీ

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిసరాలను ప్రత్యేక శ్రీటెంపుల్‌ సిటీశ్రీగా ప్రకటిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసినా.. భౌగోళికంగా దాని సరిహద్దుల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. టీటీడీ తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తితో నూతనంగా ఏర్పాటైన వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) బోర్డు ఈ టెంపుల్‌ సిటీ పరిధిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. గతంలో అధికారులు భూముల సర్వే చేసి నివేదికలు సిద్ధం చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన పాలక మండలి టెంపుల్‌ సిటీ హద్దులపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నూతన చట్ట సవరణ

ద్వారా స్వయంప్రతిపత్తి

ప్రభుత్వం ఇటీవల ‘తెలంగాణ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలీజియస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌, 1987’కు నూతన సవరణ (యాక్ట్‌ నంబర్‌. 11/2025) చేస్తూ అధికారిక గెజిట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం యాదగిరిగుట్ట దేవస్థానానికి టీటీడీ తరహాలోనే స్వయంప్రతిపత్తి కలిగిన ప్రత్యేక వైటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను ప్రత్యేక ‘టెంపుల్‌ సిటీ’ (టౌన్‌షిప్‌)గా ప్రకటించారు.

ఆమోదం పొందని గత సర్వేలు

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు, తిరుమల తరహాలో ఆలయ పవిత్రత, సంస్కృతికి అద్దంపట్టేలా టెంపుల్‌ సిటీ పరిధిని నిర్ణయించాల్సి ఉంది. అయితే గతంలో చేసిన ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. గత ఏడాది దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎం. హనుమంతరావు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు వివిధ శాఖల అధికారులతో పరిధిపై విస్తృతంగా చర్చించారు.

డీజీపీఎస్‌ సర్వే

వైటీడీఏ వివిధశాఖలతో పాటు యాదగిరిపల్లి, గుండ్లపల్లి,దాతారుపల్లి, సైదాపురం, మల్లాపురం గ్రామాల్లో భూసేకరణ చేసింది. ఈ భూములను సర్వే నంబర్ల వారీగా డీజీపీఎస్‌ సర్వే చేయించి, మ్యాప్‌లను సిద్ధం చేశారు. భవిష్యత్‌లో వివాదాలు రాకుండా భూములను ఏయే శాఖలకు కేటాయించారో సమగ్ర వివరాలు సేకరించారు. అలాగే స్వామివారికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, భువనగిరిగంజ్‌, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబగుంటపల్లి సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందల ఎకరాల భూములు, భవనాలను గుర్తించి సర్వే చేయించారు. యాదగిరిగుట్ట రింగ్‌ రోడ్డుతో పాటు తులసీకాటేజ్‌, పెద్దగుట్ట, పాత గుట్ట ప్రాంతాలను టెంపుల్‌ సిటీ పరిధిలోనే ఉంచారు.ప్రస్తుతం కొత్త పాలక మండలి ఏర్పాటైన నేపథ్యంలో.. వారు సమావేశమై టెంపుల్‌ సిటీ హద్దులపై త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రాజెక్టు శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని భక్తులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫ టీటీడీ తరహాలోనే వైటీడీకి ప్రత్యేక అథారిటీ

ఫ అయినా పరిధిపై రాని స్పష్టత

ఫ ఆమోదానికి నోచుకోని గత సర్వే నివేదికలు

ఫ హద్దుల ఖరారుపై కొత్త పాలక మండలి నిర్ణయమే కీలకం

టెంపుల్‌ సిటీ కోసం వైటీడీఏ

సేకరించిన భూమి (ఎకరాల్లో)

పరిహారం కింద

ఇటీవల మంజూరైంది రూ.100కోట్లు

పరిహారం ఇవ్వాల్సిన

భూమి..

180 ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement