త్రిపురారం : వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం వైపు మాల్లాల్సిన అవసరం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనారాయణ అన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తోడ్పాటు అందిస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పెట్టుబడి ఖర్చులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, ప్రకృతి వ్యవసాయంలో చేపట్టాల్సిన పద్ధతులు, యాంత్రీకరణ, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వినియోగంపై కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, అనిల్‌కుమార్, ఉద్యానవన శాస్త్రవేత్త హిమహిందు, గోలి మధుసూదన్, కంకణాల నివేదితారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీధర్‌రెడ్డి, దేవర శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, గండం వెంకట్‌రెడ్డి, త్రిపురారం మండల బీజేపీ అధ్యక్షుడు రెమడాల రమేష్, రైతులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ కిసాన్ మోర్చా
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ


