శాలిగౌరారం : శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌కు తృటిలో ముప్పు తప్పింది. గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలోని పంట పొలాల్లో వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా.. ఆ మంటలు స్టేషన్ వర కు సమీపించాయి. గమనించిన ఎస్‌ఐ సైదులుతో పాటు పోలీసు సిబ్బంది, స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయకుంటే పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు దగ్ధమయ్యేవి. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సైదులు పేర్కొన్నారు.
స్టేషన్ సమీపంలో వరి కొయ్యలకు
నిప్పుపెట్టడంతో సమీపించిన మంటలు
సకాలంలో స్పందించి మంటలు
ఆర్పేసిన పోలీసులు


