నల్లగొండ : మానసిక స్థిఽతి సరిగ్గా లేని ఓ యువకుడు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం నల్లగొండ–శ్రీరాంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్‌కుమార్, రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ తెలిపారు. చండూరుకు చెందిన ఇడుకుడి శ్రవణ్ (23) మానసిక స్థితి సరిగ్గా లేదు. అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న అతడు నల్లగొండ–శ్రీరాంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
నీటి కుంటలో పడి గల్లంతు
మర్రిగూడ(చింతపల్లి) : నీటి కుంటలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ముసరాంబాగ్‌కు చెందిన సయ్యద్ బుఖారి సఫ్ఫాన్(17) తన ఇద్దరు స్నేహితులో కలిసి కిష్టరాయినిపల్లి గ్రామ శివారులోని నీటి కుంట వద్ద ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బుఖారి సఫ్ఫాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. అతడి స్నేహితులు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తన సిబ్బందితో కుంట వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.


