మేము బొమ్మలు గీశామోచ్‌.. | - | Sakshi
Sakshi News home page

మేము బొమ్మలు గీశామోచ్‌..

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

మునమ్‌ఫాతిమా,

8వ తరగతి, నల్లగొండ

పోలా ఇందు,

8వ తరగతి, కోదాడ

అమయ్‌రా ఫాతిమా,

ఎల్‌కేజీ, నల్లగొండ

పగడాల రిత్విక్‌, 6వ తరగతి, నల్లగొండ

నక్క – పుల్లని ద్రాక్ష

వేసవిలో ఒక నక్కకు బాగా ఆకలిగా, దాహంగా ఉంది. అడవిలో ఆహారం కోసం వెతుకుతూ బాగా అలసిపోయింది. అలా తిరుగుతూ తిరుగుతూ.. ఒక తోటలోకి వెళ్లింది. ఆ తోటలో ఒక ఎత్తైన పందిరికి ద్రాక్ష పండ్ల గుత్తులు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూడగానే నక్క నోట్లో నీళ్లు ఊరాయి. ఎలాగైనా ఆ పండ్లను తినాలని పైకి ఎగిరింది. కానీ ద్రాక్ష గుత్తులు చాలా ఎత్తులో ఉండటం వల్ల అవి అందలేదు. తన శక్తినంతా కూడదీసుకుని చాలాసార్లు గాలిలోకి ఎగిరింది. ఎంత ప్రయత్నించినా ఒక్క పండు కూడా దానికి అందలేదు. ఎగిరిఎగిరి నక్క బాగా అలసిపోయి నీరసించింది.

ఇక లాభం లేదనుకున్న నక్క, అక్కడినుంచి వెనుదిరుగుతూ తనలో తాను ఇలా అనుకుంది. ‘ఈ ద్రాక్ష పండ్లు ఇంకా పండలేదు, పైగా

ఇవి చాలా పుల్లగా ఉండి ఉంటాయి. ఇలాంటి పుల్లటి పండ్లను తినడం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు.’ అని తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నీతి: అందని ద్రాక్ష పుల్లన

– మహ్మద్‌ ఉమర్‌, నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement