చౌటుప్పల్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో బుధవారం వాహనాలు బారులుదీరాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు అఽధికంగా ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో రద్దీ పెరిగింది. అదేవిధంగా పట్టణంలో అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్లపై ఇరువైపులా రద్దీ నెలకొంది. ప్రధానంగా వలిగొండ జంక్షన్ నుంచి తంగడపల్లి చౌరస్తా మీదుగా పైలాన్‌పార్క్ వరకు హైదరాబాద్ మార్గంలో ఎప్పుడు చూసినా వాహనాలు బారులుదీరే కనిపిస్తున్నాయి. తంగడపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


