పది ఫలితాల్లో ‘జయ’ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో ‘జయ’ ప్రభంజనం

Apr 30 2026 7:25 AM | Updated on Apr 30 2026 7:25 AM

సూర్యాపేటటౌన్‌ : పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ తెలిపారు. పాఠశాలకు చెందిన డి. రిత్విక 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి స్టేట్‌ రెండో ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా బోడ ప్రసన్న 595, కట్ట దేవిప్రియ 594, పోతుగంటి శ్రీశ్వాస 594, బుడిగ సాన్విక 593, తిప్పన శ్రీజరెడ్డి 593, కై రోజు హేమంత్‌ సాయి 592, భూరెడ్డి హర్షిత 591, కక్కిరేణి ప్రజ్వల 591, నిమ్మల వైశాలి 591, తోవిటి సహస్ర 591 సాధించినట్లు తెలిపారు. 61 మంది విద్యార్థులు 580 ఆ పైన, 143 మంది విద్యార్థులు 570 ఆ పైన, 238 మంది విద్యార్థులు 560 పైన, 330 మంది విద్యార్థులు 550 పైన, 586 మంది విద్యార్థులు 500 ఆ పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్‌తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.

ఫ 596 మార్కులతో స్టేట్‌ సెకండ్‌

ర్యాంకు సాధించిన రిత్విక

Advertisement
 
Advertisement
Advertisement