మీర్‌పేట, మర్రిగూడ: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమైపె గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంకు చెందిన నల్లబోతు నర్సింహ, వసంత(52) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చి గత ఇరవై ఏళ్లుగా బీఎన్‌రెడ్డినగర్ టీచర్స్ కాలనీలో నివాసముంటున్నారు. నర్సింహ కూలీ, వసంత ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహ తన భార్య వసంతను తరచూ అనుమానిస్తుండేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వసంతపై గొడ్డలితో నర్సింహ విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. బుధవారం సాయంత్రం స్వగ్రామం శివన్నగూడెంలో వసంత అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఫ హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఘటన
ఫ మృతురాలి స్వస్థలం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం


