లారీలు రాకుంటే ఫోన్‌ చేయరా.. | - | Sakshi
Sakshi News home page

లారీలు రాకుంటే ఫోన్‌ చేయరా..

Apr 30 2026 7:25 AM | Updated on Apr 30 2026 7:25 AM

ఆత్మకూరు (ఎం) : ధాన్యం తరలింపులో మిల్లర్లు జాప్యం చేస్తుంటే.. లారీలు రాకుంటే నాకు ఫోన్‌ చేయరా అని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆత్మకూరు (ఎం) : మండలం పల్లెపహాడ్‌లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తక్షణమే మూడు లారీలను పంపించే ఏర్పాట్లు చేస్తానని కాంటా వేసి ఎగుమతి చేయడానికి హమాలీలు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షానికి నానిన తూకం వేసిన బస్తాలను కూడా పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్డీఓ వెంట తహసీల్థార్‌ వి.లావణ్య, ఏడీఏ ఎస్‌.శ్రీనువాస్‌, ఏఓ శ్రీనువాస్‌, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ సుంకరి మంజులపరుశరాములు, ఏఈఓ వేణు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఉమారాణి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement