రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలి | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలి

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట : సీఎం రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం వారు యాదగిరీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ పార్టీని తిడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి లక్ష్మీనరసింహస్వామి మంచి బుద్ధి ప్రసాదించి పాలనపై దృష్టి పెట్టేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. వారికి ఆలయ అర్చకులు ప్రసాదం అందజేశారు. వారి వెంట కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్మన్‌ తుల ఉమ, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement