పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ

పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ

పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ

భూదాన్‌పోచంపల్లి: లక్ష్మీనారసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలను సమర్పిస్తుంటారు. అందులో భాగంగా బుధవారం స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవారి దేవతామూర్తులకు వస్త్రాలను బహుకరించేందుకు భజన, కీర్తనలతో ప్రదర్శనగా యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్లి దేవస్థాన చైర్మన్‌ నర్సింహామూర్తి, అధికారులకు రెండు పట్టు చీరలు, పంచెలు, శాలువాలను అందజేశారు. కార్యక్రమంలో పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు శ్రేష్టి, మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ సీత సత్యనారాయణ, అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ తడక రమేశ్‌, మహాజన సంఘం ఉపాధ్యక్షులు అంకం మురళి, బోగ నర్సింహ, ప్రధాన కార్యదర్శి బాలరత్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement