యాదగిరీశుడి ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాల భక్తులు, మేడారం, కొమురవెల్లి ఆలయాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ముఖ మండపం క్యూలైన్, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, మాడ వీధుల్లో రద్దీ కనిపించింది. ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.53,22,872 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.


