యువతను ప్రోత్సహించేందుకే క్రీడా పోటీలు
భువనగిరి,ఆత్మకూరు(ఎం), ఆలేరు, యాదగిరిగుట్ట రూరల్ : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఖేలో ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో, ఆత్మకూర్(ఎం), భువనగిరి, ఆలేరులో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. భువనగిరిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం హోసింగ్‌బోర్డు కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కారణాలతో ప్రతిభ కలిగిన యువత క్రీడల్లో పాల్గొనేందుకు అవకావం లభించడం లేదన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ బడ్జెట్‌లో క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్లు, మనోహార్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, రవీందర్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఫ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్


