గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

Jan 24 2026 9:00 AM | Updated on Jan 24 2026 9:00 AM

గ్రామ

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

నిధులు ఎలా ఖర్చు చేయాలో తెలుసుకున్నాను ఆత్మవిశ్వాసం వచ్చింది గ్రామసభపై అవగాహన వచ్చింది చట్టాలపై అవగాహన పెరిగింది

భూదాన్‌పోచంపల్లి : సర్పంచ్‌లు ప్రజలను భాగస్వాములను చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, తుర్కపల్లి మండలాలకు చెందిన సర్పంచులకు ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు సర్టిఫికెట్లు అందించారు. శిక్షణ తరగతుల్లో వారు నేర్చుకున్న విషయాలు, వారి అనుభాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల దుర్వి నియోగానికి పాల్పడవద్దని, మహిళా సర్పంచ్‌లు పాలనలో తమ భర్తల జోక్యం లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఆర్టీ ఆర్‌ఐ డైరెక్టర్‌ విహారికృష్ణ, ట్రైనింగ్‌ కోర్డినేటర్లు బి.శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీఓటీలు భాస్కర్‌, నవీన్‌కుమార్‌, మాజిద్‌, దినకర్‌, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

నేను మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. ఐదు రోజుల శిక్షణ వల్ల పంచాయతీపాలనపై పట్టు వచ్చింది. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులను వేటికి, ఎంత ఖర్చు చేయాలన్నది అవగాహన కల్గింది. గ్రామంలో ప్రజలకు కల్పించే మౌళిక వసతులను వివరించారు. అధికారులు అందించిన కరదీపికలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

మునుకుంట్ల నరేశ్‌, సర్పంచ్‌, గౌస్‌కొండ, భూదాన్‌పోచంపల్లి

నేను పెద్దగా చదువుకోలేదు. మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. ఇప్పటి వరకు సభలలో మాట్లాడాలంటే భయంగా ఉండేది. కానీ ట్రైనింగ్‌కు వచ్చిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. సర్పంచ్‌గా మంచి పేరు తెచ్చుకుంటా

బానోతు బూలి, సర్పంచ్‌,

మునకలపల్లి, తుర్కపల్లి

నేను బీఎస్సీ, బీఈడీ చదివాను. మొదటిసారి సర్పంచ్‌గా గెలిచాను. సర్పంచ్‌గా గ్రామ ప్రజలందరినీ సమానంగా చూడాలని అధికారులు చెప్పడం మంచిగా అన్పించింది. సర్పంచ్‌గా చేసే పనులు, చేయకూడని పనులను బాగా వివరించారు. గ్రామసభలు, పన్నుల వసూలు, విధులు, నిధులపై అవగాహన వచ్చింది. –ఆర్ల కావ్య,

జిబ్లక్‌పల్లి సర్పంచ్‌, భూదాన్‌పోచంపల్లి

నిధులు లేకుండా, సేవల ద్వారా కూడ గ్రామాన్ని ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చో బాగా వివరించారు. నేను గ్రామంలో చేపట్టిన సామాజిక పనులను చూసి సర్పంచ్‌గా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం వచ్చింది. పంచాయతీరాజ్‌ చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగింది. ఈ శిక్షణ కొత్త సర్పంచులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది.

ఎండీ జావిద్‌, సర్పంచ్‌ దుప్పల్లి, వలిగొండ

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి1
1/4

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి2
2/4

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి3
3/4

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి4
4/4

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement