సైబర్ వలలో.. విలవిల
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తూ.. ఓటీపీ, ఇతర వివరాలు సేకరించి క్షణాల్లో అకౌంట్‌ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు తెలుసుకొని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సైబర్‌క్రైంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా బ్యాంకింగ్ నేరాలే ఉన్నాయి. వీటితో పాటు ఫేక్ కస్టమర్ కేర్, ఫేక్‌లోన్ యాప్ వేధింపులు, ఉద్యోగాలు, విస్సా, రుణ ప్రాడ్స్, గిఫ్ట్, లాటరీ ఫ్రాడ్, డేటా చోరీ, క్రిఫ్టో, పెట్టుబడులు, మాట్రిమోనియల్, హానీట్రాప్, డిజిటల్ అరెస్ట్ తదితర ఆన్‌లైన్ మోసాలు గత ఏడాదితో పోలిస్తే ఈసంవత్సరం భారీగా పెరిగాయి. చౌటుప్పల్ పట్టణంలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.8.42,663 పోగొట్టుకున్నాడు. ఇటువంటి ఘటనలు మరికొన్ని ఉన్నాయి.
డ్రగ్స్ కేసులు భారీగానే..
జిల్లాలో ఈఏడాది డ్రగ్స్ కేసులు భారీగా నమోదయ్యాయి. గత ఏడాది 34 కేసులు నమోదు కాగా.. ఈసారి ఆ సంఖ్య 46కు పెరిగింది. మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న 69 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా గంజాయి కేసులు ఎక్కువగా ఉన్నాయి.
భువనగిరి జోన్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ పోలీస్ కమిషనరేట్ విడుదల చేసింది. దీని ప్రకారం 18 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 13,400 ఫిర్యాదులు రాగా.. పోలీసుల విచారణ
అనంతరం 10,107 కేసులు నమోదయ్యాయి. అందులో 12,300 కేసులు పరిష్కరించారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు, దొంగతనాలు, లైంగికదాడులు తగ్గగా..
సైబర్ నేరాలు, ఫోక్సో కేసులు పెరిగినట్లు
నివేదిక చెబుతోంది.
– సాక్షి యాదాద్రి


