మేనమామపై గెలుపు
ఫ ఒక్క ఓటు తేడాతో దక్కిన విజయం
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెం గ్రామంలో బుధవారం జరి గిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేనమామపై మేనల్లుడు
విజయం సాధించాడు. గ్రామానికి చెందిన కందుకూరి సత్యనారాయణరెడ్డి, ఆయన మేనల్లుడు ఉట్కూరి మాధవరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్థులుగానే సర్పంచ్ బరిలో నిలబడ్డారు. వీరిలో పార్టీ ఎవరినీ అభ్యర్థిగా బలపర్చనప్పటికీ మాధవరెడ్డికి 397 ఓట్లు రాగా.. కందుకూరి సత్యనారాయణరెడ్డికి 396 ఓట్లు వచ్చాయి. మాధవరెడ్డి ఒక్క ఓటు తేడాతో మేనమామపై విజ యం సాధించాడు. సత్యనారాయణరెడ్డి సర్పంచ్‌గా పోటీ చేయడం ఇది మూడోసారి కాగా.. మూడుసార్లు ఓడిపోవడం గమనార్హం.
రెండు ఓట్లతో దక్కిన విజయం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలచర్చిన అభ్యర్థి ఆదిరాల సుమలత రెండు ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిపై జిట్ట సంధ్యారాణిపై గెలుపొందింది. మొదట 3 ఓట్ల తేడా ఉండగా.. రీ కౌంటింగ్‌లో 2 ఓట్ల తేడాతో నెగ్గింది.
అప్పుడు ఎంపీటీసీ.. ఇప్పుడు సర్పంచ్
నేరేడుచర్ల : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చలసాని మంజుల 890 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. మంజుల 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ ఎంపీటీసీగా గెలుపొందింది.
నాడు భర్త.. నేడు భార్య
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడిద అపర్ణ 396 ఓట్ల మెజార్టీతో అదే పార్టీకి చెందిన రెబెల్ అభ్యర్థిపై గెలుపొందింది. కాగా గత ఎన్నికల్లో అపర్ణ భర్త మనోజ్‌కుమార్ ఆ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు.
మేనమామపై గెలుపు
మేనమామపై గెలుపు
మేనమామపై గెలుపు
మేనమామపై గెలుపు


