కాంగ్రెస్
న్యూస్‌రీల్
బీఆర్‌ఎస్
బీజేపీ
నూతన సర్పంచ్‌లకు నేడు కేటీఆర్ సత్కారం
సాక్షి, యాదాద్రి : తమ పార్టీల తరఫున కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను అభినందించడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు గురువారం భువనగిరికి రానున్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన అభినందన సత్కార కార్యక్రమం జరగనుంది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో..
రాయగిరిలోని లింగబసవ గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ అధ్యక్షతన బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్‌లను సత్కరించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేతులమీదుగా సత్కారం ఉంటుందన్నారు.
గుట్ట క్షేత్రానికి అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనం
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి హైదరా బాద్‌లోని మెడికోవర్ ఆస్పత్రి బహూకరించిన అంబులెన్స్‌ను ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి బుధవారం ప్రారంభించారు. అంబులెన్స్‌తో పాటు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, ఆలయాధికారి రఘు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామున శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు.
మొదటి విడత
ఉమ్మడి జిల్లాలో మూడు
విడతల్లో
వివిధ పార్టీల
మద్దతుదారులకు లభించిన స్థానాలు
కాంగ్రెస్
కాంగ్రెస్
కాంగ్రెస్
కాంగ్రెస్
కాంగ్రెస్


