సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా..
పెన్‌పహాడ్ : ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెపుకుంట తండాకు చెందిన భూక్య హరిలాల్(28) ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మురళీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో తండావాసుల ధర్నా
కొన్నిరోజులుగా తండాలోని ఇళ్లలో కరెంట్ ఎర్త్ వస్తుందని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తండావాసులు ఆరోపించారు. ఈ క్రమంలో పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై హరిలాల్ మృతదేహంతో ధర్నా చేపట్టారు. విద్యుత్ ఏఈ శ్రీనివాసు, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ అక్కడకు చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఫ విద్యుదాఘాతంతో యువకుడు మృతి


