పరదాల చాటున పోలింగ్
సంస్థాన్ నారాయణపురం : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం డాకుతండా పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు పరదాలు కట్టి పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కిచెన్ రూంలో మరో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాధనగర్‌తండా పాఠశాల వరండాలో గ్రీన్ మ్యాట్ చాటున 2 పోలింగ్ బూత్‌లు, మరో రెండు పాఠశాల్లో వరండాలోనే బహిరంగంగా రెండు బూత్‌లను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రం ఎదుటే బురద
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం ఎదుటే బురద గుంత ఉంది. అధికారులు కనీసం బురద గుంతలో మట్టి కూడా పోయలేదు. బురద గుంతను ఓటర్లు అతికష్టం మీద దాటుతూ వచ్చి ఓటేశారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్ అయినా బురద గుంత లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పరదాల చాటున పోలింగ్
పరదాల చాటున పోలింగ్


