పల్లె పాలనపై పాఠ్యాంశం
ఆలేరు: పంచాయతీ పాలనపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘గ్రామ పంచాయతీలు’ శీర్షికతో పాఠ్యంశాన్ని పొందుపర్చింది. పంచాయతీ పాలన, విధులు, విధానాలపై పాఠ్యాంశంలో వివరించింది.
ఈ అంశాలపై అవగాహన
● ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పల్లెల పురోగతికి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎలా కృషి చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు ఏయే పన్నుల ద్వారా ఆదాయాన్ని పంచాయతీలు ఎలా సమకూర్చుకుంటాయి.
● పంచాయతీల నిర్వహణ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలతోపాటు అధికారాలు, గ్రామసభలు, సమావేశాల్లో తీర్మానాలు, నిర్ణయాలు ఎలా జరుగుతాయి.
● ప్రజల పాత్ర, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీ ఆస్తుల పరిరక్షణపై పాఠంలో చేర్చారు.
పాఠ్యాంశం ద్వారా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, సర్పంచ్, ఉ ప సర్పంచ్‌లను ఎన్నుకునే పద్థతి గురించి అవగాహన కల్గింది. కార్యదర్శి అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్‌ల బాధ్యతల గురించి పాఠ్యాంశంలో వివరంగా చెప్పడం వల్ల అవగాహన పెరిగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిసింది. –బి.భవానీ, 6వ తరగతి, ఆలేరు
అభివృద్ధి పనులను గుర్తించి గ్రా మ సభలు,సమావేశాల ద్వారా ఎలా తీర్మానాలు చేస్తారో తెలి సింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చతాయని తెలి సింది. పన్నుల గురించి అవగాహన ఏర్పడింది.
–పి.రిశిక్, 6 తరగతి, ఆలేరు
ఫ 6వ తరగతి సాంఘికశాస్త్రంలో పొందుపర్చిన విద్యాశాఖ
ఫ పంచాయతీ నిర్వహణపై విద్యార్థి స్థాయినుంచే అవగాహన
పల్లె పాలనపై పాఠ్యాంశం
పల్లె పాలనపై పాఠ్యాంశం


