140 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్
ఓటేయనున్న
2,02,716 మంది ఓటర్లు
పోలింగ్ సిబ్బంది
పీఓలు 1,296
ఓపీఓలు 1,572
స్టేజ్ –2
ఆర్‌ఓలు 145
జోనల్
ఆఫీసర్లు
28
సాక్షి, యాదాద్రి : పల్లె పోరు రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 140 సర్పంచ్, 1,161 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.పోలింగ్ నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా 3,041 మంది అధికారులు, సిబ్బందిని ఆయా పంచాయతీలకు కేటాయించారు. వారంతా పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు.
సర్పంచ్ స్థానాలకు 388 పోటీ
రెండో విడత భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో 150 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 10 చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిని మినహాయించి 140 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 388 మండి పోటీ పడుతున్నారు. 1,332 వార్డు సభ్యుల స్థానాల్లో 171 ఏకగీవ్రం కాగా.. మిగిలిన 1,161 స్థానాలకు 2,821 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో 2,02,716 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 1,00,801, మహిళలు 1,01,915 మంది ఉన్నారు. పోలింగ్ కోసం 1,161 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు.
1,161 పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల కోసం వార్డుకు ఒకటి చొప్పున 1,161 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 49 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇందులో వలిగొండ మండలంలో 18, బీబీనగర్‌లో 14, భువనగిరిలో 7, రామన్నపేటలో 6, భూదాన్‌పోచంపల్లి మండలంలోని నాలుగు ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ను ఉన్నతాధికారులు పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపును కూడా ఇక్కడి నుంచే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
ఫ భారీ పోలీసు బందోబస్తు
ఫ సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, ప్రత్యేక బలగాల మొహరింపు
సర్పంచ్ అభ్యర్థులు
మండలం జీపీలు ఎన్నికలు అభ్యర్థులు
జరిగేవి
పోచంపల్లి 21 20 52
భువనగిరి 34 31 80
బీబీనగర్ 34 30 81
రామన్నపేట 24 22 61
వలిగొండ 37 37 114
మొత్తం 150 140 388
140 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్
140 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్
140 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్
140 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్


