ఫ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి సీఎం
పకడ్బందీగా వివరాల నమోదు
విధుల్లో చేరిన
యాదగిరిగుట్ట ఆలయ ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ విధుల్లో చేరారు. సెప్టెంబర్ 24వ తేదీన వ్యక్తిగత సెలవుల్లో ఆయన అమెరికాకు వెళ్లారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిటీ సభ్యుడు రవినాయక్, దేవాదాయశాఖ ఇంచార్జ్ కమిషనర్ హరీష్ బాధ్యతలు నిర్వర్తించారు. గురువారం విదేశాల నుంచి వచ్చిన వెంకట్రావ్ శుక్రవారం విధుల్లో చేరారు.
ఈ–కేవైసీ ఉంటేనే ‘ఉపాధి’
ఆలేరు రూరల్: ఉపాధిహామీ పథకంలో అవకతవకలకు తావు లేకుండా కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన నిబంధనలు, సంస్కర ణలు తీసుకువస్తోంది. అయినా ఎక్కడో ఒక చోట అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి, పథకం మరింత పారదర్శకంగా అమలు జరిగేలా ఈకేవైసీ విధానం తీసుకువచ్చింది. ఈకేవైసీ చేయించుకోని కూలీలు ఉపాధిహామీ పథకానికి దూరం కానున్నారు.
1,13,805 మంది ఈ–కేవైసీ పూర్తి
జిల్లాలో 1,27,274 మంది ఉపాధిహామీ పథకంలో కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు పనికి రాకున్నా కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు.. నకిలీ, పాత ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఒకరి పేరున మరొకరు పనులకు వెళ్లినా హాజరు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలినా రికవరీ అంతంతమాత్రంగానే ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పేట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,13,805 మంది కూలీలు ఈ–కేవైసీ చేయించారు.
రెండుసార్లు ఫొటో తప్పనిసరి..
కూలీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన తర్వాత ఇళ్లకు వెళ్లేటప్పుడు మరోసారి ముఖ ఫొటో తీసార్లు. ఆ తరువాత ఫొటోలను ఎన్‌ఆర్‌ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. కూలీల వివరాలు యాప్‌లో నమోదు కానిపక్షంలో వారు పనులకు వెళ్లినా హాజరువేయలేరు. పనిప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్‌లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం వెంటనే గుర్తిస్తుంది.తదవఆరా తప్పడు హాజరుగా నిర్థారించబడుతుంది. ఈ–కేవైసీ వందశాతం పూర్తయితే ఈజీఎస్‌లో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మండలాల వారీగా ఇలా..
మండలాలు కూలీలు ఈ–కేవైసీ
ఆలేరు 4,353 3,941
అడ్డగూడూరు 7,154 6,393
ఆత్మకూరు 7,358 6,393
భువనగిరి 9,296 8,456
బీబీనగర్ 6,208 5,580
బి.రామారం 5,853 5,049
చౌటుప్పల్ 7,655 6,705
గుండాల 9,820 8,729
తుర్కపల్లి 7,947 6,984
మోటకొండూర్ 5,486 4,884
నారాయణపురం 12,057 11,139
పోచంపల్లి 5,709 5,156
రాజపేట 8,941 7,916
రామన్నపేట 8,603 7,990
వలిగొండ 11,169 9,632
యాదగిరిగుట్ట 5,796 5,318
మొత్తం 1,27,274 1,13,805
పథకంలో పాదర్శకతకు నూతన విధానం
ఫ కూలీలు పనికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్
ఫ రెండు ఫొటోలు సరిపోలితేనే హాజరు
ఫ ఈ–కేవైసీతో నకిలీలకు అడ్డుకట్ట
ఉపాధిహామీ కూలీలు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. వివరాల నమోదును పకడ్బందీగా చేపడుతున్నాం. జిల్లాలో 1,27,274 కూలీలు ఉండగా 1,13,805 మంది కూలీల ఈ–కేవైసీ పూర్తిచేశాం. ఈ–కేవైసీ చేయించుకోని కూలీలు ఉపాధి పనులకు దూరమవుతారు.
–నాగిరెడ్డి డీఆర్‌డీఓ
ఫ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి సీఎం
ఫ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి సీఎం


