పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, కార్తీక దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం, రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మదన వేణుగోపాల స్వామికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం, పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


