మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన

Nov 8 2025 6:57 AM | Updated on Nov 8 2025 6:57 AM

మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన

మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన

బీబీనగర్‌: బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో మానవ, జంతు ఆరోగ్యం, పర్యావరణ పరస్పర అనుసంధానంపై ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనోటిక్‌ వ్యాధులను నివా రించడానికి ఆహారభద్రతను నిర్ధారించడం, వ్యాధుల విచ్ఛిన్నం చేయడంపై వైద్య నిపుణులు వివరించారు. అనంతరం ఆరోగ్య విధానాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదే విధంగా జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినోత్సవం సందర్భంగా రేడియేషన్‌, అంకాలజీ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్‌ నివారణపై నిపుణులు అవగాహన కల్పించారు. క్యాన్సర్‌ నివారణకు వైద్యులు, నర్సులు కృషి చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అమితా అగర్వాల్‌ సూచించారు. రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ రాహుల్‌నారంగ్‌, ప్రొఫెసర్‌ శ్యామల, వైద్యులు లక్ష్మీజ్యోతి, రుద్రేష్‌కుమార్‌, చావాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement