అన్నదాతకు తేమ టెన్షన్
రాజాపేట: గిట్టుబాటు ధర దక్కుతుందని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లిన రైతులు.. తేమ, తరుగు సమస్యతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే కాంటా తిరస్కరిస్తారు. కాగా తేమ శాతాన్ని పరిశీలించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగిస్తున్న మాయిశ్చర్ మిషన్లపై అపోహలు నెలకొన్నాయి. నిర్వాహకులకు యంత్రాలపై సరైన అవగాహన లేకపోవడంతో తేమ శాతంలో వ్యత్యాసం వస్తుంది.
10 శాతానికి పైగా వ్యత్యాసం
రాజాపేటలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి రాజాపేటకు చెందిన రైతు సోమసాని రాజు, పారుపల్లికి చెందిన గౌరబావు ధాన్యాన్ని తీసుకువచ్చారు. వడ్లు గలగల చప్పుడు వచ్చేలా ఎండబెట్టారు. కాగా కేంద్రం నిర్వాహకులు సోమవారం తేమచూడగా రాజుకు చెందిన వడ్లు 24 శాతం, గౌరబాబు తెచ్చిన వడ్లు 29 శాతం చూపించాయి. అనుమానం వచ్చిన రైతులు.. విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక రైస్ మిల్లులో మరోసారి మాయిశ్చర్ మిషన్ ద్వారా పరిశీలించగా ఇద్దరి ధాన్యం 15 శాతం లోపే వచ్చింది.10 శాతానికి పైగా వ్యత్యాసం చూపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైస్‌మిల్లులోని యంత్రంలో వచ్చిన తేమ శాతం ఇదీ..
కొనుగోలు కేంద్రంలో వచ్చిన తేమ శాతం
ఫ ఎలక్ట్రానిక్ యంత్రాలతో ఇబ్బందులు
ఫ తేమ శాతంలో తేడాలు
అన్నదాతకు తేమ టెన్షన్


