పత్తి రైతుల రాస్తారోకో
మోటకొండూర్: కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనా లని డిమాండ్ చేస్తూ మంగళవారం మోటకొండూ ర్ మండలం కాటేపల్లి గ్రామంలోని రాయిగిరి రో డ్డుపై పత్తి రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తేమ శాతం ఎక్కువ ఉందని కొనకుండా తిరస్కరించడం తగదన్నారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, డీఏఓ వెంకటరమణారెడ్డి, ఏఓ రమాదేవి రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. సాయంత్రం వరకు కొనుగో లు చేస్తామని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు బచ్చ శ్రీశైలం, రేగు ఇస్తారి, మంత్రి రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


