28 పాఠశాలలకు ఫైవ్‌స్టార్
క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తాం
భువనగిరి : స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో ప్రోత్సహకాలు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛతలో ఆరు అంశాలకు సంబంధించి వాటి చిత్రాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 15 నాటికి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. నమోదు చేసిన వివరాల ఆధారంగా రేటింగ్స్ ప్రకటించారు. ఇందులో జిల్లాలోని 28 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించకున్నాయి.
60 ప్రశ్నల ఆధారంగా..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛతా కార్యక్రమాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ రేటింగ్ సమర్పించారు. నీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల శుభ్రత, ప్రవర్తనా మార్పులు, విద్యార్థుల నడవడిక, మిషన్ లైప్ కార్యక్రమాల ఆరు అంశాలు, 60 ప్రశ్నల ఆధారంగా మార్కులు కేటాయించారు. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో చేసిన నమోదు ప్రకారం మొదటి కేటగిరీ కింద 1 నుంచి 8వ తరగతి వరకు, రెండో కేటగిరీ కింద 9 నుంచి 12వ తరగతి వరకు గల పాఠశాలలను తీసుకున్నారు.
819 పాఠశాలలకు వివిధ రేటింగ్స్
స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయం రేటింగ్ కింద జిల్లాలో 819 ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేశారు. ఇందులో 28 పాఠశాలలకు 5 స్టార్, 352 పాఠశాలలకు 4 స్టార్, 383 పాఠశాలలకు 3 స్టార్, 50 పాఠశాలలకు 2 స్టార్, 6 పాఠశాలలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. రేటింగ్ ప్రకటించిన పాఠశాలలను క్షేత్ర స్థాయిలో త్వరలో పరిశీలించనున్నారు. ఇందు కోసం ఈ నెల 27న 50 మంది కాంప్లెక్స్, సీనియర్ హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడిన పాఠశాలలో రాష్ట్ర స్థాయికి రూరల్ నుంచి 6, అర్బన్ నుంచి 2 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి అవార్డులు ఇస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇతర జిల్లాల అధికారులు మదింపు చేసి ఆయా పాఠశాలలను పరిశీలన చేస్తారు.
జాతీయస్థాయికి ఎంపికై తే
రూ.లక్ష బహుమతి
5, 4 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు సందర్శించి వాటిల్లోని స్వచ్ఛత కార్యక్రమాలు, విద్యార్థుల నమోదును పరిశీలిస్తాయి. 3 స్టార్ రేటింగ్ పొందిన వాటికి జిల్లా స్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన వాటికి రాష్ట్ర స్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన బడులకు జాతీయ స్థాయిలో ప్రోత్సహకాలు అందిస్తాయి. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదు బహుమతితో పాటు కేంద్రం పురస్కారం లభించనుంది.
జిల్లా స్థాయిలో రేటింగ్ ప్రకటించిన పాఠశాలలను మూడు రోజుల్లో హెచ్‌ఎంలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇందు కోసం 50 మందికి శిక్షణ ఇచ్చాం. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలకు ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదు అందనుంది.
– సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి
ఫ స్వచ్ఛత కార్యక్రమాల ఆధారంగా
ప్రకటించిన రేటింగ్
ఫ మరో 791 పాఠశాలలకు వివిధ గ్రేడ్‌లు
ఫ ‘ఎస్‌హెచ్‌వీఆర్’లో భాగంగా ఎంపిక
ఫ త్వరలోనే పరిశీలనకు
ప్రధానోపాధ్యాయులు


