నిబంధనలు పాటించేనా!
కొత్త దుకాణాలైనా..
● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పాతగుట్టకు వెళ్లే దారిలో ఉన్న రెండు వైన్స్‌ల వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆలయానికి వెళ్లే భక్తులకు, వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శని, ఆదివారాల్లో ఇక్కడి ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉంటాయి.
జనావాసాల్లోనే వైన్స్‌లు, పర్మిట్ రూమ్‌లు
ఫ హైవేల వెంట బెల్టు షాపులు
ఫ రోడ్లపైనే వాహనాల పార్కింగ్
తప్పని ట్రాఫిక్ సమస్యలు
ఫ ఇబ్బందుల్లో మహిళలు, విద్యార్థులు
ఫ ఇళ్ల మధ్యలోని మద్యం షాపులను
మార్చాలంటున్న ప్రజలు
సాక్షి, యాదాద్రి : నిబంధనలను అతిక్రమించి జనావాసాల్లో మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు వెలుస్తున్నాయి. బడి, గుడి సమీపాల్లోనూ బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీనికితోడు జాతీయ రహదారుల వెంట దాబాలు, కిరాణ దుకాణాల మాటున మద్యం విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని పోలీస్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలనైనా జనావాసాల మధ్య, హైవేల వెంట ఏర్పాటు చేయొద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎకై ్సజ్ శాఖ పట్టించుకోదా..
మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చే విషయంలో ఎకై ్సజ్ అధికారులు నిబంధనలను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నా యి. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, జాతీయ, రాష్ట్ర రహదారులు, జనావాస ప్రాంతాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, దేవాలయాలను విస్మరిస్తూ వైన్స్‌ల ఏర్పాటుకు అనుమతులిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కమర్షియల్ జోన్‌లో ఇవ్వాల్సిన అనుమతులు జనం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఇస్తున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో జనావాసాలు, హైవేల వెంటే..
బొమ్మలరామారం మండలం గుడిబావి చౌరస్తా మూలమలుపులో వైన్స్ ఉండడం.. అక్కడ రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి నుంచి రాయిపల్లి వరకు ప్రధాన స్టేజీల వెంట బెల్టు దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారు. మోత్కూరు–రాయిగిరి రోడ్డు వెంట రహీంఖాన్ పేట, ఆత్మకూరు (ఎం), రాయిపల్లి స్టేజీల వద్ద బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు.
మోత్కూరులో చెరువు కట్ట వద్ద ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఉంది. దీన్ని తొలగించాలని గతేడాది కొందరు ఫిర్యాదులు చేశారు. అమ్మనబోలు రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద ఉన్న వైన్స్, భువనగిరి రోడ్డులో పూలే విగ్రహం వద్ద ఉన్న వైన్స్, సిట్టింగ్ ఉండడంతో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ చేస్తున్నారు.
చౌటుప్పల్‌లో ఆరు వైన్స్‌లు, మూడు బార్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారుల వెంట ఉండడంతో సర్వీస్ రోడ్లు పూర్తిగా ట్రాఫిక్‌తో స్తంభించిపోతున్నాయి.
రామన్నపేటలో చిట్యాల రోడ్డు వెంట మూడు వైన్స్‌లు ఉన్నాయి. సాయంత్రం వేళలో జనం కిక్కిరిస్తుడడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది
అడ్డగూడూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్యం షాపులు ఉన్నాయి. కార్యాలయానికి వచ్చిన రైతులతోపాటు ఈ వైన్స్‌లకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు.
తుర్కపల్లి లో దుర్గమ్మ గుడి, బీసీ కాలనీ దగ్గర్లో వైన్స్‌లు ఉండడం వల్ల కాలనీవాసులకు ఇబ్బందులు పడుతున్నారు. ములకలపల్లి, రుస్తాపూర్‌లో బెల్ట్ షాపులు, రోడ్డు పక్కన హోటల్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
భువనగిరిలో కొత్త, పాత బస్టాండ్ల వద్ద ఉన్న వైన్స్‌లను తొలగించాలని స్థానికులు గతంలో ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదు.
బీబీనగర్‌లో ఇళ్ల మధ్య వైన్స్, పర్మిట్ రూమ్‌లు ఉన్నాయి. భట్టుగూడెంలోని ఆలయాలకు సమీపంలో వైన్స్ ఉంది. కొండమడుగులోని ఇళ్ల మధ్య వైన్స్, పర్మిట్ రూమ్ ఉన్నాయి.
పోచంపల్లిలో ఇళ్ల మధ్య మూడు వైన్స్‌లు, పర్మిట్‌రూమ్‌లు ఉండడంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలను ఊరికి దూరంగా తరలించాలని కోరుతూ సోమవారం వివిధ యువజన సంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆలేరులో సిల్క్‌నగర్ వద్ద రోడ్డు వెంట వైన్స్, పర్మిట్ రూమ్ ఉన్నాయి. పట్టణంలోని రైల్వేగేట్, బస్టాండ్‌వద్ద ఉన్న వైన్స్‌లు, పర్మిట్ రూమ్‌లు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.


