
‘జూబ్లీహిల్స్’లో మంచ్యాతండా వాసి నామినేషన్
మఠంపల్లి: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మంచ్యాతండాకు చెందిన ఓయూ జేఏసీ ఉపాధ్యక్షుడు, స్థానిక గుర్రంబోడు భూపరిరక్షణ సమితి అద్యక్షుడు సపావట్ సుమన్‌నాయక్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినేట్‌లో లంబాడీలకు చోటు కల్పించాలని, గుర్రంబోడు భూముల్లో గిరిజనులకు పట్టాలివ్వాలని కోరారు. అదే విధంగా లంబాడీలకు, ఆదివాసీలకు నడుమ నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.