
బుద్ధవనాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్
నాగార్జునసాగర్ : సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) డైరెక్టర్ ఆశిష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ రోహిత్‌సింగ్ సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలనకై వచ్చిన వారు బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో గల ధ్యానం చేశారు. వీరికి బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర బుద్ధవనానికి సంబంధించి బ్రోచర్లను అందజేశారు. సమావేశ మందిరంలో బుద్ధవనం వీడియోను వీక్షించారు. వీరి వెంట సాగర్ డ్యాం ఏఈలు కృష్ణయ్య, స్వర్ణ తదితరులు ఉన్నారు.