
ఉమ్మడి జిల్లాలో ఒక రాజకీయ శకం ముగిసింది
భానుపురి (సూర్యాపేట): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక రాజకీయ శకం ముగిసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు, ధాన్యం కొనుగోళ్లు.. ఇలా అన్నింట్లోనూ ముందుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెడతామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారని, రెండు రోజుల్లో జీఓ వస్తుందని తెలిపారు. ఎస్సారెస్పీ నీళ్ల కోసం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రక్త దర్పణం చేశారని, దాంతోనే ఆ నీళ్లు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తున్నాయని పేర్కొన్నారు. సూర్యాపేటకు ఆరు లేన్ల రోడ్డును, రైల్వే స్టేషన్‌ను తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న పెద్దఎత్తున నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్, పీసీసీ జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, ఓబీసీ నాయకుడు తండు శ్రీనివాస్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్లు అరుణ్ కుమార్, నరేష్ సుమతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, మండల పార్టీ అధ్యక్షులు వీరన్ననాయక్, తూముల సురేష్ రావు, కోతి గోపాల్‌రెడ్డి, కందాల వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, దండి రమేష్, జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు కక్కిరెని శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, కోదాడ, హుజుర్‌నగర్ మండల, బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జెండా నిలబడిందంటే
రాంరెడ్డి దామోదర్‌రెడ్డితోనే
స్థానిక సంస్ధల ఎన్నికల్లో
క్లీన్‌స్వీప్ చేస్తాం
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి