
బాలాజీపై ఒక్కరోజే 112 ఫిర్యాదులు
పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్‌పై సోమవారం ఒక్కరోజూ 112 ఫిర్యాదులు అందాయి.ఇ సోమవారం గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి కోర్టు ద్వారా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసిన గుడిపల్లి పోలీసులు