
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
వలిగొండ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రానికి పది రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా కాస్తున్నాం. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మద్దయింది. సుమారు 25 బస్తాల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యం కాంటా వేయాలి.
–బంగమట్ల శ్రీశైలం, మల్లేపల్లి,
వలిగొండ మండలం
11 ఎకరాలు నల్లరేగడి రూ.2లక్షలకు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాల వల్ల గూడ, కాత రాలిపోవడంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే చేలు.. సగం కూడా వస్తలేవు. కూలీలతో ఐదు ఎకరాల్లో పత్తి తీయించగా 11 క్వింటాల దిగుబడి వచ్చింది. చేనుపై మరో 25 క్వింటాళ్ల పత్తి ఉంది. ఈ ఏడు కూడా నష్టాలు తప్పేలా లేవు.
–బచ్చ శ్రీశైలం, సికిందర్‌నగర్,
మోటకొండూరు మండలం

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి