
పక్కా భవనాలు నిర్మించాలి
తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా మోటకొండూర్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయలేదు. అప్పుడు అధికారం ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన మండలాలను ఇచ్చి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా పనులు సాగడం లేదు. పక్కా భవనాలు నిర్మించి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– పీసరి తిరుమలరెడ్డి, బీజేపీ
జిల్లా నాయకుడు, మోటకొండూర్
అడ్డగూడూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. అద్దె భవనాల్లో ఇరుకై న గదుల్లో కార్యాలయాలు నిర్వహిస్తుండంతో వసతులు లేక ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది. వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేయాల్సి వస్తోంది.
– బుర్రు అనిల్ కుమార్,
గోవిందాపురం, అడ్డగూడూరు మండలం

పక్కా భవనాలు నిర్మించాలి