
రోడ్డు దాటుతుండగా బైక్‌ను ఢీకొట్టిన లారీ
నకిరేకల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై బైక్‌పై వస్తున్న ఇద్దరు యవకులు రోడ్డు దాటుతుండగా లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నకిరేకల్‌లోని మార్కెట్ రోడ్డులోని నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శానాల యుగేందర్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి (26) ఇటీవల బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. విక్రమ్‌రెడ్డి తన ఇంటి నుంచి మార్కెట్ రోడ్డులో నివాసం ఉంటున్న తన మిత్రుడు రావుల ప్రభు(23)తో కలిసి బైక్‌పై నకిరేకల్ శివారులోని పద్మానగర్ జంక్షన్‌కు వెళ్లి తిరిగి నకిరేకల్‌కు వస్తున్నాడు. జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్యాంకర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో విక్రమ్‌రెడ్డి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న ప్రభుకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు విక్రమ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రభు పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీ ట్యాంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యుగేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్ తెలిపారు. కాగా.. విక్రమ్‌రెడ్డి తండ్రి యుగేందర్‌రెడ్డి సొంత గ్రామం శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం. గత కొన్నేళ్ల క్రితం నకిరేకల్‌లోని మార్కెట్ రోడ్డులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తమ కుమారుడికి వివాహ సంబంధాలు కూడా చూస్తున్నామని, ఇంతలోనే ఇలా అయిందని కన్నీటిపర్యంతమయ్యారు.
ఫ ఒకరు మృతి,
మరొకరికి తీవ్రగాయాలు

రోడ్డు దాటుతుండగా బైక్‌ను ఢీకొట్టిన లారీ