
నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాక
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, ఇతర న్యాయమూర్తులు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు రానున్నారు. జస్టిస్ ఏకే సింగ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు ఉదయం పదిగంటలకు చేరుకుంటారు. శ్రీ స్వామివారి దర్శనం, ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అనంతరం కొండపైన విశ్రాంతి గృహం నుంచి మంచిర్యాల జిల్లా కోర్టు భవనాల సముదాయానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం యాదగిరిగుట్ట నుంచి నేరుగా భువనగిరిలోని మాస్‌కుంటవద్దకు వెళ్తారు. అక్కడ జిల్లా కోర్టు భవనాల సముదాయానికి హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తారు. ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శరత్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సృజనా కళాశికం, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొంటారు. న్యాయమూర్తుల పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఫ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఫ లక్ష్మీనరసింహస్వామి దర్శనం