
సివిల్ సప్లై కమిషనర్ తనిఖీలు
సాక్షి,యాదాద్రి : సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామన్నపేటలోని వాసవీ రైస్ మిల్, వలిగొండలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం, నాగిరెడ్డిపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాములు, భువనగిరిలోని స్టాక్ పాయింట్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు, మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్, ఎంత ఇచ్చారనే విషయాలపై తెలుసుకున్నారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బియ్యం రవాణా పంపిణీ ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆయన వెంట అధికారులు సివిల్ సప్లై అధికారులు రోహిత్ సింగ్, హరికృష్ణ ఉన్నారు.