
నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నాం : కలెక్టర్ హనుమంత
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాకు సంబంధించి మొదటి విడతలో 10 జెడ్పీటీసీలు, 84 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల గురువారం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చామన్నారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు డీసీపీ ఆకాంక్ష్‌యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ విష్టువర్ధన్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.