
వంతెనను పునర్నిర్మించాలి
ఎన్నో ఏళ్ల కిత్రం నిర్మించిన పెద్దవాగుపై వంతెనను పునర్నిర్మించాలి. శిథిలమైన ఈ వంతెనపై ప్రయాణం ప్రమాదకరమే. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
– పత్తి రాములు, ఆలేరు
ఆలేరు పెద్దవాగు వంతెన ఎన్‌హెచ్‌ఏ పరిధిల్లోంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకురావాలి. అప్పటి అవసరాల మేరకు నిర్మించిన వంతెన ఇప్పుడు ఇరుకుగా మారింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలి.
– సృజన్‌కుమార్, ఆలేరు
●
ఆలేరు పెద్దవాగుపై నిర్మించిన వంతెన మా పరిధిలో లేదు. ఎన్‌హెచ్‌ఏ పరిధిలో ఉంది. పునర్నిర్మాణం, మరమ్మతులు చేయాలన్నా ఎన్‌హెచ్‌ఏ అధికారుల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది.
– కరుణాకర్ ఆర్‌అంబీ ఏఈ ఆలేరు

వంతెనను పునర్నిర్మించాలి