
మద్యం టెండర్లకు 157 దరఖాస్తులు
భువనగిరి : జిల్లాలో కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 82 దుకాణాలకు గత సెప్టెంబర్ 26 నుంచి టెండర్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బుధవారం 25 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి. టెండర్లకు ఈ నెల 18 వరకు గడువు ఉంది.
ప్రతి గ్రామానికి
నాణ్యమైన విత్తనాలు
ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం : ప్రతి గ్రామంలోని రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలు అందించేందుకు కృషిచేస్తున్నామని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, జిల్లా ప్రధాన శాస్త్రవేతలు డాక్టర్ డి.శ్రీలత, డాక్టర్ బి.అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం వారు ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం, కూరెళ్ల, పల్లెర్ల, బొమ్మలరామారం మండల కేంద్రంతోపాటు నాగినేనిపల్లి, మర్యాల, మేడిపల్లి, తిరుమలగిరి, ధర్మారెడ్డిగూడెం గ్రామాల్లో వరి, పెసర విత్తనోత్పత్తి క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. జూన్ మొదటి వారంలోనే పరిశోధన కేంద్రాల్లో వరి కేఎన్‌ఎం–1638 రకం, పెసర ఎంజీజీ–295 రకం విత్తనాలను అభివృద్ధి చేశామన్నారు. వీటిని ఇప్పటికే రెవెన్యూ గ్రామానికి ముగ్గురిని ఎంపిక చేసి వ్యవసాయ శాఖ పంపిణీ చేసిందన్నారు. వారి వెంట ఏఈఓలు సరిత, క్రాంతి, రైతులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ మానసిక ఆరోగ్యంగా ఉండాలి
బీబీనగర్: ప్రతిఒక్కరూ మానసిక ఆరోగ్యంగా ఉంటేనే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొవచ్చని బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్‌లో ఎయిమ్స్ వైద్య కళాశాలలో మనోరోగ చికిత్స విభాగం ఆధ్వర్యంలో బుధవారం మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అలాగే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం ముగియడంతో స్మారక వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానసిక ఆరోగ్యంపై ఎంబీబీఎస్ విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించడారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డీన్ నితిన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్వర్ లక్కిరెడ్డి, వైద్యులు సంగీత సంపత్ తదతరులు పాల్గొన్నారు.
సాంకేతికతను
అందిపుచ్చుకోవాలి
ఆలేరు: మారుతున్న కాలానుకనుగుణంగా విద్యార్థులు అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఉపాధ్యాయులు ఆధునిక పరికరాలతో బోధన చేయాలని జిల్లా సైన్స్ అధికారి(డీఎస్‌ఓ) పులుమద్ధి రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలో సాంకేతిక బోధనకు ఎంపికై న ఆలేరు, రాజాపేట పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు అగ్నెంటేషన్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టికరింగ్ ల్యాబ్(ఏటీఎల్)ను డీఎస్‌ఓ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జిల్లాలోని ఇతర పీఎంశ్రీ స్కూళ్లలో ఈ తరహా బోధన అందుబాటులోకి వస్తుందన్నారు. తెలిపారు. అనంతరం టెక్నికల్ ట్రైనర్ అఖిల్.. ఏఆర్, వీఆర్ హెడ్‌సెట్‌ల పనితీరు, బోధన విధానం తదితర సాంకేతిక అంశాలపై వివరించారు. ఆలేరు పాఠశాల హెచ్‌ఎం దాసరి మంజుల, ఉపాధ్యాయులు రావుల సత్యనారాయణరెడ్డి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మద్యం టెండర్లకు 157 దరఖాస్తులు

మద్యం టెండర్లకు 157 దరఖాస్తులు