
కొనుగోళ్లకు సిద్ధం
సమన్వయంతో పనిచేయాలి
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం
మొత్తం కొనుగోలు కేంద్రాలు : 325
ఐకేపీ దొడ్డురకం : 183
ఐకేపీ సన్నరకం : 37
పీఏసీఎస్ దొడ్డు రకం : 86
పీఏసీఎస్ సన్న రకం : 5
ఎఫ్‌పీఓ కొనుగోలు కేంద్రాలు : 14
ఏ గ్రేడ్‌కు మద్దతు ధర రూ.2,389
సాధారణ రకం మద్దతు ధర రూ.2,369
సాక్షి, యాదాద్రి: వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముందుగా సాగు చేసిన నాన్ ఆయకట్టు మండలాల్లో వారం నుంచే వరి కోతలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో 2,06,618 ఎకరాల్లో వరిసాగుకాగా.. ఇందులో దొడ్డురకం 1,85,952 ఎకరాలు, సన్నరకం 20,666 ఎకరాల్లో సాగు చేశారు. 4.58 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల అవసరాలు, విత్తనాలు, స్థానిక అవసరాలకు పోను రైతుల నుంచి 2.80 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 20 వేల మెట్రిక్‌టన్నుల సన్నరకం ధాన్యం కలిపి మొత్తంగా 3లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరి ధాన్యం క్వింటా ఏ గ్రేడ్‌కు రూ.2,389, సాధారణ రకం క్వింటాకు రూ. 2,369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.
మహిళా సంఘాలకు పెద్దపీట
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 325 కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకే పెద్దపీట వేశారు. ఐకేపీ, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ సేకరించాలి. ధాన్యం పూర్తి వివరాలు ఏరోజుకారోజు నమోదు చేయాలి. కొనుగోలు రవాణా, డ్రై మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్లు, తేమ శాతం, ఆటోమెటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు వచ్చాయి. సివిల్ సప్లై శాఖ ద్వారా కేంద్రాల్లో గన్ని సంచులు సిద్ధం చేసుకుంటున్నారు.
మౌలిక వసతుల కల్పన
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యంపై వచ్చే కమీషన్ నుంచి రైతులు తాగడానికి మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్యాడీ సెంటర్లను శుభ్రంగా ఉంచాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.
వెంటనే మిల్లులకు పంపించేలా..
రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు, హమాలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ జిల్లాలో 325 కేంద్రాల ఏర్పాటు
ఫ వేర్వేరుగా సన్నరకం,
దొడ్డు రకం కేంద్రాలు
ఫ ఇప్పటికే కేంద్రాల
నిర్వాహకులకు శిక్షణ
ఫ కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా ప్రణాళిక
వానాకాలం వరిధాన్యం కొనుగోలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ధాన్యం కొనుగోలుపై మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, సివిల్ సప్‌లై డీఎం హరికృష్ణ, డీఏఓ రమణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీసీఓ శ్రీధర్, రోజారాణి పాల్గొన్నారు.