
అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్
ఆలేరు: మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికిల్ కోర్సుతోపాటు పలు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులకు జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం ఆలేరు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ని ఆయన సందర్శించారు. ఏటీసీలోని వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంతో టాటా టెక్నాలజీస్ చేసుకున్న ఒప్పందం మేరకు శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివిధ కోర్సుల్లో 172మంది అడ్మిషన్లు తీసుకున్నారని, ఏడుగురు టెక్నికల్ బోధకులు ఉన్నారని, త్వరలో మరికొంతమంది నియామకమవుతారని ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థులకు డ్యూయల్‌డెస్క్‌లు, ఏటీసీ ఆవరణలో సీసీ రోడ్డుతోపాటు తాగునీటి అవసరాలకు బోరు కావాలని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు పొందిన సందర్భంగా హరికృష్ణను కలెక్టర్ సన్మానించారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి
గుండాల : గ్రామాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ఆశ కార్యకర్తలు కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలపై ఆశ కార్యకర్తలు గర్భిణులకు అవగాహన కల్పించాలని, పౌష్టికాహారం తీసుకునేవిధంగా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులు పరిశీలించారు. బిల్లులు రాని లబ్ధిదారులకు సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ చండీరాణి, ఎంపీఓ సలీమ్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హౌసింగ్ ఏఈ కావ్యశ్రీ, పంచాయతీ కార్యదర్శి మునావర్, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు