
స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
చౌటుప్పల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని ఫంక్షన్ హాల్‌లో మునుగోడు నియోజకవర్గ బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ, ఎంపీపీ, 72 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి ప్రచారం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భీంస కృష్ణ బీజేపీలో చేరగా.. ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, బచ్చగోని దేవేందర్,నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం,మండల అధ్యక్షులు కై రంకోండ ఆశోక్,సుర్వీ రాజు,పందుల సత్యం,పెంబల జానయ్య,రావుల ఎల్లప్ప,రాజేందర్‌నాయక్,మునిసిపాలిటి అధ్యక్షురాలు కడారి కల్పన,నాయకులు గుజ్జల సురేందర్‌రెడ్డి, రమణగోని శంకర్, పాలకూర్ల జంగయ్య, భవనం మధుసూదన్‌రెడ్డి, చినుకని మల్లేష్, కాయితి రమేష్, దుర్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ నేత మనోహర్‌రెడ్డి