
యాదగిరి క్షేత్రంలో వైభవంగా శరత్ పౌర్ణమి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం శరత్ పౌర్ణమిని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో విహార యాత్రగా ప్రత్యేక సేవలో ఊరేగించారు. అనంతరం ఆలయ మండపంలో శ్రీస్వామి అమ్మవార్లను వేంచేపు చేయించి, వేద మంత్రాలతో పూజించి, కీర్ నివేదన, ప్రబంధ పారాయణం పఠించారు. నాలుగు వేదాలతో పారాయణం చేశారు. ఽశరత్ పౌర్ణమి సందర్భంగా విశేష ప్రసాదాన్ని నివేదనగా చేసి సమర్పించారు. భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.