
ఆనందకరమైన జీవితం గడపాలి
భువనగిరిటౌన్ : మత్తు పదార్థాలు, ఇతర చెడు వ్యసనాలను వీడి ఆహ్లాదకరమైన జీవనం ప్రారంభించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత సూచించారు. భువనగిరిలోని సింగన్నగూడెంలో గల న్యూహోప్ అసోసియేషన్ డి అడిడక్షన్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. మత్తు జోలికి వెళ్లకుండా స్వీయనియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. మత్తుకు బానిసలవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. కాకుండా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహకారం పొందవచ్చని, జిల్లా కేంద్రంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. న్యాయపరమైన సలహాలకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చన్నారు. మానసిక వైద్యులు డాక్టర్ ప్రీతిస్వరూప్ మాట్లాడుతూ చెడు వ్యసనాల వల్ల కలిగే మానసిక సమస్యలను అధిగమిం చేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కృషి చేస్తుందన్నారు. కేంద్రంలో అందిస్తున్న చికిత్సల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్ కోమలి, డాక్టర్ శశాంక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ నారగోని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత