
అలైన్‌మెంట్‌పై హామీ నిలబెట్టుకోవాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల మూలంగా తాము ఏవిధంగా నష్టపోతున్నామని వివరించారు.ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిబంధనల ప్రకారం 48 కిలోమీటర్లు ఉండాలని, కానీ 28 కిలో మీటర్లు మాత్రమే ఉన్నదని తెలిపారు. బడా వ్యక్తులు, పారిశ్రామికవేత్తల కోసం అలైన్‌మెంట్ పలుమార్లు మార్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అలైన్‌మెంట్ మారుస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రియాంకగాంధీ భువనగిరి వచ్చినప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం, మంత్రులు తమను కనీసం కలవడంలేదని, అపాయింట్‌మెంట్ కూడా ఇస్తలేని తెలిపారు. మీనాక్షి నటరాజన్ స్పందించారని.. సీఎంతో మాట్లాడుతానని, రాహుల్‌గాంధీ దృష్టికి సమస్య తీసుకెళ్లి భూర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని రైతులు జాల వెంకటేశం, నాగవెళ్లి దశరథ తెలిపారు.
ఫ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌కి ‘రీజినల్’ భూ నిర్వాసితుల వినతి