
14 వరకు పరీక్ష ఫీజు గడువు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగీ మూడవ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలకు ఈ నెల 14వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించాలని ఎంజీయూ సీఓఈ ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు.
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
భువనగిరి: పద తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈఓ సత్యనారా యణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా భువనగిరి మండలం కూనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రత్యేక తరగతులను పర్యవేక్షించారు. తరగతి గదిలో కూర్చొని విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధిస్తున్న తీరును పరిశీలించారు.వెనుబడిన విద్యార్థులను ప్రత్యేక దృష్టి సారించాలని, హెచ్‌ఎంలు కూడా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేక చేసి, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం,జోడుసేవోత్సవం నిర్వహించారు.
వేడుకగా అశ్వవాహన సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. స్వామి, అమ్మవారిని సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సేవను చూసి తరించారు.ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, మూలమంత్ర హవనం, నిత్యకల్యాణం నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు పాల్గొన్నారు.

14 వరకు పరీక్ష ఫీజు గడువు

14 వరకు పరీక్ష ఫీజు గడువు