భూములు లాక్కుంటే ప్రతిఘటిస్తాం | - | Sakshi
Sakshi News home page

భూములు లాక్కుంటే ప్రతిఘటిస్తాం

Oct 7 2025 3:19 AM | Updated on Oct 7 2025 3:19 AM

భూములు లాక్కుంటే ప్రతిఘటిస్తాం

భూములు లాక్కుంటే ప్రతిఘటిస్తాం

భువనగిరిటౌన్‌ : రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం బలవంతంగా భూములను లాక్కుంటే ప్రతిఘటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులతో పాటు, రైతు సంఘాల ప్రతినిధులు, సీపీఎం జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు. గ్రామసభలను నిర్వహించి రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలని డిమాండ్‌ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూమిని తీసుకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2013 చట్టంలోని షెడ్యూల్‌ 1లో చూపిన విధంగా మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు, ఫార్మా సంస్థల యాజమానులు, ధనికులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే అలైన్‌మెంట్‌లో ప్రభుత్వం మార్పులు చేసిందని విమర్శించారు.

ఆశాసీ్త్రయంగా అలైన్‌మెంట్‌ : జహంగీర్‌

రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అశాసీ్త్రయంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్‌ అన్నారు.సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఫార్మా సంస్థల అధినేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల భూములు పోతున్నందుకే అలైన్‌మెంట్‌ మార్చారని విమర్శించారు. రైతుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు ఆ పదవిలో ఉండే నైతిక హక్కు లేదన్నారు. పదవులకు రాజీనామా చేస్తారా?, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాత అలైన్‌మెంట్‌ అమలు చేస్తారా? తేల్చుకోవాలన్నారు. అనంతరం సీపీఎం నాయకులు అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీరాంనాయక్‌, బి.ప్రసాద్‌, కొండమడుగు నర్సింహ, ప్రజాసంఘాల నాయకులు కోట రమేష్‌, ఎం.శోభనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement