
హర్షవర్ధన్ అంత్యక్రియలు పూర్తి
చౌటుప్పల్: నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లబావి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో మునిగి మృతిచెందిన చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన పోలోజు హర్షవర్ధన్(17) అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జిల్లేడు చెట్టుతో హర్షవర్ధన్‌కు వివాహం జరిపించి అంతిమయాత్ర నిర్వహించారు. హర్షవర్ధన్ భౌతికకాయానికి అతడి తాత నర్సింహాచారి తలకొరివి పెట్టారు. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర మాజీ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, వివిధ పార్టీల నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్, యువజన సంఘాల ప్రతినిధులు, మృతుడి స్నేహితులు, తదితరులు నివాళులర్పించారు. మృతుడి తల్లిదండ్రులు శ్రీనివాసచారి–శ్రావణిలను ఓదార్చారు.
రిషిక్ నేత్రాలు లయన్స్ క్లబ్‌కు దానం
నార్కట్‌పల్లి: ఇదే ప్రమాదంలో మృతిచెందిన నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నల్లగొండ రిషిక్(17) నేత్రాలను అతడి తల్లిదండ్రులు నాగరాజు, స్వాతి నార్కట్‌పల్లి లయన్స్ క్లబ్‌కు దానం చేశారు. అనంతరం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పలు వురు పాల్గొని నివాళులర్పించారు.